టిల్లు-3పై త్వరలోనే నిర్ణయం : నాగవంశీ

Mar 30,2024 19:30 #movie, #siddu jonnalagadda

‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా త్వరలో టిల్లు-3 తీయబోతున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. హీరోగా సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ టిల్లు-2 సినిమా శుక్రవారంనాడు విడుదలైన విషయం తెలిసిందే. మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ తమ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి మంచి టాక్‌ వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా సినిమాకు కలిసి వస్తాయన్నారు. టిల్లు స్క్వేర్‌ రూ.100 కోట్ల కలెక్షన్లు సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తంచేశారు. త్వరలో మూడో భాగాన్ని కూడా ప్రకటిస్తామని నాగవంశీ వెల్లడించారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ డీజే టిల్లు సినిమాను మంచి ప్రమాణాలతో తీశారన్నారు. నిర్మాతలు అనుకున్నట్లుగానే సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్‌’ సూపర్‌హిట్‌ టాక్‌ను అందుకుందన్నారు.

➡️