ఎన్టీఆర్‌కు ప్రత్యేక చిత్రంగా ‘దేవర’ : కొరటాల శివ

May 6,2024 18:46 #New Movies Updates, #NTR

‘ఎన్టీఆర్‌కు, ఆయన అభిమానులకు ‘దేవర’ సినిమా ఖచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. త్వరలోనే అప్‌డేట్స్‌ వస్తాయి’ అని దర్శకుడు కొరటాల శివ వ్యాఖ్యానించారు. కొరటాల శివ దర్శకత్వంతో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం దేవర’. ఎన్టీఆర్‌ పుట్టినరోజు (మే20) సందర్భంగా దీని నుంచి అప్‌డేట్‌ వచ్చే అవకాశముందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో జాన్వీ తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కీలక పాత్రలో శ్రీకాంత్‌ కనిపించనున్నారు. తొలుత ఈ మూవీ మొదటి భాగాన్ని ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల దీని విడుదలను అక్టోబర్‌ 10కి వాయిదా వేశారు.

➡️