హీరోగా ఘట్టమనేని జయకృష్ణ

టాలీవుడ్‌లోకి సూపర్‌స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరోగా జయకృష్ణ రాబోతున్నాడు. అతని బాబారు మహేష్‌బాబు ఇప్పటికే ఆ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. యాక్టింగ్‌, డ్యాన్స్‌, ఫైటింగ్‌ అంశాలపై జయకృష్ణ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో జయకృష్ణ యాక్టివ్‌గా ఉంటున్నారు. తన డ్యాన్స్‌తో అదరగొడుతున్నారు. సుదీర్ఘకాలంపాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరో కృష్ణ. ఆయన తర్వాత వారసులుగా రమేష్‌బాబు, మహేష్‌బాబులను పరిచయం చేశారు. ఆయన కుమార్తె మంజుల కూడా కొన్ని చిత్రాల్లో కనిపించారు. మహేష్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతున్నారు. జయకృష్ణ రమేష్‌బాబు కుమారుడు.జయకృష్ణ పుట్టినరోజు జులై 17. ఆరోజున సినిమా ప్రకటన చేస్తారని సమాచారం.

➡️