‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల

May 23,2024 19:20 #ajith, #movie

తమిళ హీరో అజిత్‌ నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అజిత్‌ మూడు ముఖాలతో కూడిన ఈ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఆయనకు జంటగా శ్రీలీల, మీనా, సిమ్రాన్‌ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రానుంది.

➡️