19న ‘హను-మాన్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

Dec 12,2023 17:26 #movies

హను-మాన్‌ ఫస్ట్‌ ఇండియన్‌ ఒరిజినల్‌ సూపర్‌ హీరో మూవీ, అలాగే ఇది ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ ఫస్ట్‌ ఇన్స్టాల్‌ మెంట్‌. అన్ని మాధ్యమాల్లో వైరల్‌గా మారిన టీజర్‌తో సినిమాకు నేషనల్‌ లెవల్‌ క్రేజ్‌ ఏర్పడింది. మేకర్స్‌ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆల్బమ్‌లో డిఫరెంట్‌ స్టయిల్‌ పాటలు వున్నాయి. తేజ సజ్జ నటించిన ఈ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ థియేట్రికల్‌ ట్రైలర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ‘హను-మాన్‌’ ట్రైలర్‌ను డిసెంబర్‌ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ట్రైలర్‌ పోస్టర్‌ హీరో కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపించారు, అతని వెనుక భారీ హనుమాన్‌ విగ్రహం ఉంది. హను-మాన్‌ జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్‌, స్పానిష్‌, కొరియన్‌, చైనీస్‌, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్‌ వరల్డ్‌ విడుదల కానుంది.

➡️