అమ్మ రూమ్‌లో వాటిని దొంగతనం చేశాను : జాన్వీ కపూర్‌

Jan 4,2024 18:12 #Janhvi Kapoor, #movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ఇంటర్వ్యూల్లో తన తల్లి శ్రీదేవి గురించి చెబుతూ ఎమోషనల్‌ అవుతుంటుంది. తాజాగా జాన్వీ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అమ్మ నన్ను ఎప్పుడూ నా కొడకా అని పిలిచేది. నేను అమ్మ రూమ్‌లోకి వెళ్లి లిప్‌స్టిక్స్‌ తీసుకుని నా జేబులో పెట్టుకొని వచ్చేస్తా.. బయటకు రాగానే.. నా జేబులు చూపించమని అడిగేది. నేను.. నో మమ్మా అని పరిగెట్టేదాన్ని. అప్పుడు అమ్మ నా కొడకా అంటే నా వెంట వచ్చేది.’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో నటిస్తోంది.

➡️