‘దేవర’లో అవకాశం నా అదృష్టం- జాన్వీ కపూర్‌

May 22,2024 19:20 #Janvikapur, #movie

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంతో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ టాలీవుడ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేవర’లో పాత్ర గురించి మాట్లాడారు. ‘దేవరలో ‘తంగం’ పాత్ర పోషిస్తున్నాను. అది ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌ చాలా సరదాగా జరిగింది. సెట్‌లోని వారంతా నాపై ఎంతో ప్రేమగా ఉంటారు. చిత్రయూనిట్‌ అంకితభావానికి ఆశ్చర్యపోయాను. ఇది విభిన్నమైన కథ. అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ‘దేవర’లో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని చెప్పారు.

➡️