రామ్‌ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌

Feb 20,2024 11:30 #movie

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్‌చరణ్‌ చిత్రం గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామాగా ఉండబోతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా హీరోయిన్‌ను చిత్ర బృందం ఫిక్స్‌ చేసింది. బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా నటించనుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మా అమ్మాయి ఇప్పటికే ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’లో నటిస్తోంది. సెట్‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తోంది. మరికొద్ది రోజుల్లో రామ్‌చరణ్‌ నటించబోయే మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటుంది. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ ఇద్దరే. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాలని ఆకాంక్షిస్తున్నా. మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశం జాన్వీకి రావాలి. నా భార్య శ్రీదేవి పలు భాషల్లో నటించారు. అలాగే నా కుమార్తె కూడా నటించాలి’ అని బోనీకపూర్‌ అన్నారు.

➡️