‘కంగువ’ విడుదల తేదీ ఖరారు

Jun 28,2024 07:31 #New Movies Updates

విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య నటించిన చిత్రం ‘కంగువ’ విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 10 న కంగువ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుందని సూర్య ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఒక పోస్టర్ ను పోస్టు చేశారు. ఇప్పటికే  విడుదల అయిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, కేవీఎన్‌ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, స్టార్ హీరోయిన్ దిశా పటానీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

➡️