ఆగస్టు 15కు ‘కల్కి’ వాయిదా?

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఎడి’ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మే 9న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేసి ఆగస్టు 15న విడుదల చేయటానికి చిత్రనిర్మాతలు ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. అయితే అదేరోజు అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప-2’ విడుదల కానుంది. అదేరోజు బాలీవుడ్‌ నుంచి మరో చిత్రం ‘సింగం ఎగైన్‌’ కూడా విడుదల కానుంది. కన్నడలో శివరాజ్‌కుమార్‌ సినిమా ‘భైరతి రంగల్‌’ కూడా అదే రోజు విడుదల కానుంది. వాయిదా పడితే విడుదల తేదీపై ‘కల్కి’ బృందం అధికారికంగా ప్రకటించాల్సివుంది.

➡️