మణికంఠన్‌ హీరోగా …

Dec 19,2023 19:05 #manikantan, #movie

జై భీమ్‌ చిత్రంతో గుర్తింపుపొందిన నటుడు మణికంఠన్‌ తాజాగా ఓ కొత్త సినిమాలో నటించబోతున్నారు. నటిగా శాన్వి మేఘన, గురు సోమసుందర రాజన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమా కారం పతాకంపై ఎస్‌.వినోద్‌కుమార్‌ నిర్మాత. రాజేశ్వర్‌ కలిసామి దర్శకత్వం వహిస్తున్నారు. కోయంబత్తూర్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. దర్శకుడు రాజేశ్వర్‌ మాట్లాడుతూ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు వృత్తి, కుటుంబపరంగా ఎదుర్కొనే సవాళ్లు, చేసే సాహసాలను చూపే కథాంశంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు.

➡️