నా సామి రంగ మూవీ ట్రైలర్‌

Jan 9,2024 17:00 #movie, #nagarjuna

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటుడు నాగార్జున నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ‘పోరింజు మరియమ్‌ జోస్‌’ అనే మలయాళ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు విజరు బిన్నీ దర్శకత్వం వహించారు. నాగార్జున హీరోగా, అషికా రంగనాథ్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్‌లో యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయి. చాన్నాళ్ల తర్వాత నాగార్జున మాస్‌ ప్రేక్షకులను అలరించేటటువంటి సినిమాలో నటించారు.

➡️