సాయం చేసినా.. నయన్‌ని తిడుతున్న నెటిజన్లు

Dec 8,2023 15:52 #movie, #nayanatara

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : మిచౌంగ్‌ తుఫాను వరద బాధితులకు ప్రముఖ హీరోయిన్‌ నయనతార సాయం చేసినప్పటికీ నెటిజన్లు మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. సాయం చేస్తే.. ఫైర్‌ అవ్వడమేంటి అని అనుకుంటున్నారా? ఇటీవల మిచౌంగ్‌ తుఫాను వల్ల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. వరద బాధితులకు సాయం చేసేందుకు నయన ముందుకొచ్చింది. తాను నిర్వహిస్తున్న ‘ఫెమి 9’ కంపెనీ వ్యాన్లలో ఆహారం, దుస్తులు, శానిటరీ న్యాప్‌కిన్లు, మెడిసిన్స్‌, పాలు వంటివి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియను చూసిన కొందరు నెటిజన్లు నయన్‌ని అభినందిస్తుంటే.. మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. సాయం చేసేటప్పుడు కూడా ‘ఫెమీ 9’ కంపెనీ ప్రమోట్‌ చేసుకోవడం అవసరమా అంటూ ఆమెపై మండిపడుతున్నారు.

 

➡️