ఎన్టీఆర్‌ ‘దేవర’ గ్లింప్స్‌ నెక్ట్స్‌ లెవెల్‌

Jan 8,2024 16:59 #jr ntr

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ నటిస్తున్న తాజా సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 1:19 సెకన్లు ఉన్న ఈ గ్లింప్స్‌లో.. పడవలపై కొంతమంది సముద్రంలోకి వెళ్లడం .. షిప్‌ ను చుట్టుముట్టి దానిలోని సరుకును కాజేయడం చూపించారు. సముద్రపు దొంగల నేపథ్యంలో సాగే కథగా ఇది కనిపిస్తుంది. ఆ దొంగలతో హీరో పోరాడటం చూపించారు. ‘ఈ సముద్రం చేపలకంటే కత్తులను .. నెత్తురును ఎక్కువగా చూసి ఉంటుంది. అందుకే దీనిని ఎర్రసముద్రం అంటారు’ అనే ఎన్టీఆర్‌ డైలాగ్‌.. ఎన్టీఆర్‌ యాక్షన్‌కు సీన్స్‌, మాస్‌ లుక్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అని చెప్పొచ్చు. కాగా.. సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 5న పాన్‌ ఇండియా రేంజ్‌లో ‘దేవర’ విడుదల కానుంది.

➡️