‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో అప్ కమింగ్ ఫిల్మ్ లో బ్యాంగ్ బ్రదర్స్‌గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఒక క్రేజీ ఫన్ రైడ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి ‘ఓం భీమ్ బుష్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఖరారు చేశారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ప్రీ-లుక్ గ్లింప్స్‌తో దృష్టిని ఆకర్షించిన మేకర్స్, ఫస్ట్లలుక్ పోస్టర్‌తో ముందుకు వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు తమ చేతుల్లో పేలుడు పరికరాలతో అంతరిక్ష నౌకలో భూమిలోకి ప్రవేశిస్తున్నట్లు గ్లింప్స్ చూపించింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ రూరల్ ఏరియాలో చేతిలో కొన్ని పామ్ ప్లేట్స్‌తో స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్నారు. వీరంతా వ్యోమగామి దుస్తులను ధరించారు. ఫస్ట్ లుక్ క్రేజీగా అందరినీ అలరిచింది. ఓం భీమ్ బుష్ షుటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మార్చి 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/movie-1.jpg)