‘మసూద’కి ప్రీక్వెల్‌ వస్తోంది..

Feb 12,2024 20:03 #New Movies Updates

తిరువీర్‌, కావ్య కళ్యాణ్‌ రామ్‌ జంటగా నటించిన ‘మసూద’ చిత్రానికి ప్రీక్వెల్‌ రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా తెలిపారు. ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రాహుల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ”కొత్త టాలెంట్‌ వస్తోంది. అదే నా బిగ్గెస్ట్‌ సపోర్ట్‌. కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లు, కొత్త రైటర్లు వచ్చినప్పుడు తాజా విషయాలు బయటికి వస్తాయి. రిస్క్‌ ఎక్కువ తీసుకుంటారు. సినిమా ఇలానే తీయ్యాలి, అలానే తియ్యాలి అనే నోషన్స్‌ ఏమీ ఉండవు. ఈ రూల్స్‌ పాటించాలి అనేవి ఉండవు. భయం తెలియకుండా ధైర్యం వస్తుంది’ అని చెబుతూ ‘మసూద’ ప్రీక్వెల్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నామ’ని ప్రకటించారు.

➡️