పుష్ప-2 సెకండ్‌ సింగిల్‌కి రంగం సిద్ధం

May 23,2024 19:15 #movie, #Rashmika

అల్లు అర్జున్‌ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’ ప్రమోషన్‌ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ చిత్రం రెండో సాంగ్‌ డ్యూయెట్‌పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. రష్మికపై ఓ చిన్న బైట్‌ వీడియోతో ‘సూసేకి అంటూ సాగే సాంగ్‌ ఈ మే 29న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణం వహిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.

➡️