త్వరలో రకుల్‌ పెళ్లి?

Jan 1,2024 19:45 #movies, #rakul

నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ త్వరలో పెళ్లిచేసుకోతున్నారనేది సమాచారం. బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో తాను 2021 నుంచి రిలేషన్‌లో ఉన్నట్లుగా గతంలోనే ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో వీరు ప్రేమపెళ్లితో ఒక జంట కాబోతున్నారనేది నెట్టింట వైరల్‌ అవుతోంది. గతంలోనే ఇలాంటి ఊహాగానాలు రాగా సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని అప్పట్లో ఆమె స్పష్టతనిచ్చారు. ఇదిలావుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో రకుల్‌-భగ్నానీల పెళ్లి జరగనుందంటూ పలు ఆంగ్లపత్రికల్లో కథనాలు వచ్చాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. ఆ తర్వాత సినీ ప్రముఖులకు ప్రత్యేక విందు కూడా ఏర్పాటుచేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయనేది సారాంశం.

➡️