ధనరాజ్‌ దర్శకత్వంలో సముద్రఖని

Jan 22,2024 20:37 #New Movies Updates

ధనరాజ్‌ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ బ్యానర్‌పై ప్రభాకర్‌ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా తెరకెక్కుతున్న ఈ ద్విభాష చిత్రానికి ‘రామం రాఘవంష’ టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని సోమవారం ఇరవై రెండు మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు. ‘ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామ’ని ఈ సందర్భంగా ధనరాజ్‌ తెలిపారు. మోక్ష, హరీష్‌ ఉత్తమన్‌, సత్య పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్‌ యానా కథను సమకూర్చారు. అరుణ్‌ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్‌, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

➡️