‘శరపంజరం’ ప్రీ రిలీజ్‌ వేడుక

Apr 13,2024 19:22 #movie, #Naveen kumar

నవీన్‌ కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘శరపంజరం’. దోస్తాన్‌ ఫిలింస్‌, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై టి.గణపతిరెడ్డి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌ లయ. ప్రీ రిలీజ్‌ వేడుకను శనివారం నాడు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈనెల 19న ఈ సినిమా విడుదల కానుంది. వరంగల్‌ భాషన్న, ఆనంద్‌ భారతి, జబర్దస్త్‌ వెంకీ, జీవన్‌, రాజమౌళి, మిల్కీ, అలువాల సోమయ్య, మౌనశ్రీ మల్లిక్‌, మేరుగు మల్లేశం గౌడ్‌, కళ్యాణ్‌; మెజీషియన్‌ మానుకోట ప్రసాద్‌, కృష్ణవేణి, ఉదయశ్రీ, రజియ, ఉషా తదితరులు నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, టి.గణపతిరెడ్డి, నవీన్‌గట్టు, మల్లిక్‌ ఎంవివి మాట్లాడారు.

➡️