సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్న శ్రీలీల.. ఎందుకంటే?

Dec 18,2023 12:58 #movie, #sreeleela

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : హీరోయిన్‌ శ్రీలీల ‘ధమాకా’, ‘భగవంత్‌ కేసరి’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ‘ఆదికేశవ’, ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌’ మూవీలు శ్రీలీలకి అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఈ సినిమాల్లో శ్రీలీల నటనకు ఆస్కారం లేని పాత్రల్లో నటించిందని అటు ఆమె అభిమానులు, సినీవర్గ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు శ్రీలీల సినిమా షూటింగ్‌లకు వారం పదిరోజులపాటు దూరంగా ఉంటుందట. ఏదైనా ప్రమాదం జరిగి షూటింగ్‌లకు దూరంగా ఉందా అని ఆరాతీస్తే.. ఆమె ఎంబీబిఎస్‌ పరీక్షల్ని రాయడానికే షూటింగ్‌లకు దూరంగా ఉందని తన స్నేహితులు చెబుతున్నారు. మెడిసిన్‌ ఎగ్జామ్స్‌ అయిపోయాక.. మళ్లీ యధావిధిగా ముందు ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లో పాల్గొంటుందట. కాగా, శ్రీలీల హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా… తాను ఎంబిబిఎస్‌ పరీక్షల్ని కచ్చితంగా రాస్తుంది. షూటింగ్‌ బ్రేక్‌ టైమ్స్‌లో ఈ పరీక్షలకి తాను ప్రిపేర్‌ అవుతూ ఉంటుందట. నటన అంటే తనకి ఎంత ఇష్టమో.. మెడిసిన్‌ చదవాలనేది తన కోరిక అని శ్రీలీల ఇప్పటికే చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

➡️