ఐటెం సాంగ్‌కు ‘నో’ చెప్పిన శ్రీలీల

May 4,2024 19:20 #New Movies Updates, #sreeleela
Working-as-a-doctor-Srileela

తమిళ హీరో దళపతి విజయ్ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించేందుకు వచ్చిన అవకాశాన్ని హీరోయిన్‌ శ్రీలీల తిరస్కరించారు. టాలీవుడ్‌లో అగ్రనాయికగా ఉన్న ఆమెకు తమిళంలోనూ అవకాశాలు క్యూకడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేవలం ఆ ఇండిస్టీలో మొదటి సినిమాలోనే ఐటెం సాంగ్‌లో నటిస్తే మిగతా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయని ఆమె భావించిందట. అందుకే తిరస్కరించినట్లుగా సమాచారం. విజయ్ ప్రస్తుతం ‘గోట్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్‌ మోహన్‌, ప్రశాంత్‌, ప్రభుదేవా, వైభవ్‌, ప్రేమ్‌ జీ వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఉన్న ఒక స్పెషల్‌ సాంగ్‌లో నటి త్రిష పేరును అనుకోగా కాల్షీట్లు లేనికారణంగా ఆమె అంగీకరించలేదు. దీంతో శ్రీలీల పేరు పరిశీలించారు. శ్రీలీల త్వరలో హీరో అజిత్‌ సరసన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

➡️