ప్రేమ వివాహం చేసుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ అక్ష పార్ధసాని

Feb 27,2024 12:40 #Aksha Pardasany, #heroine, #marriage

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ టాలీవుడ్‌ హీరోయిన్‌ అక్ష పార్ధసాని తాను ప్రేమించిన కౌశల్‌ని సోమవారం (ఫిబ్రవరి 26) వివాహం చేసుకున్నారు. వీరు గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు. పెళ్లి కుమారుడు కౌశల్‌ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌. వరుడుగా కౌశల్‌ కెమెరా క్రేన్‌ మీద కూర్చొని వివాహ వేడుకలో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘అసలైన కెమెరామెన్‌ అనిపించుకున్నాడు’ అని కౌశల్‌పై కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లి ఫొటోలను అక్ష సోషల్‌మీడియా ద్వారా షేర్‌ చేశారు. ఈ ఫొటోలకు ‘మా ప్రార్థనలు ఫలించాయి. మేమిద్దరం ఒక్కటయ్యాం. దేవుడి దయతోపాటు మా ఇరు కుటుంబాల ఆశీర్వాదాలు మాకెప్పుడూ ఉంటాయి.’ అని అక్ష క్యాప్షన్‌ పెట్టారు. ఈ నూతన జంటకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా, అక్ష తెలుగులో యువత, రౌడ్‌, కందిరీగ, బెంగాల్‌ టైగర్‌, శత్రువు, రాధా, డిక్టేటర్‌ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లో పలు వెబ్‌సిరీస్‌లో నటించింది. ఆ సమయంలోనే సినిమాటోగ్రాఫర్‌ అయిన కౌశల్‌ పరిచయం, పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇరుకుటుంబ సభ్యుల్ని ఒప్పించి.. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

➡️