సీతాఫలం

Dec 19,2023 10:04 #Jeevana Stories

సీతాఫలం సీతాఫలం

శీతాకాలపు మధుర ఫలం

తియ్యని రుచుల తేనె ఫలం

కనువిందైన కమ్మని ఫలం

 

సీతాఫలం సీతాఫలం

చలికాలం సుందర ఫలం

నోరూరించే సుమధుర ఫలం

నవనవలాడే నవ్య ఫలం

 

సీతాఫలం సీతాఫలం

చూడచక్కని తీపి ఫలం

మధువొలికించు రమ్య ఫలం

తెల్లని తీయని గుజ్జుఫలం

 

సీతాఫలం సీతాఫలం

చిరునవ్వుల దివ్య ఫలం

పోషక విలువల భవ్య ఫలం

ఔషధ గుణాల ఆరోగ్య ఫలం

– గుండాల నరేంద్ర బాబు,తెలుగు భాషా పరిశోధకులు,94932 35992.

➡️