ఎండు చేపలతో మెండైన లాభాలు

Feb 17,2024 07:10 #Food

ఎండు చేపలను ఇష్టంగా తినేవారు చాలామందే ఉంటారు. ఇవి రుచికే కాదు, అనేక రకాల ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు.

క్యాల్షియం అధికం : ఎండు చేపల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటుతో బాధ పడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే, సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

ప్రోటీన్‌ లభ్యత : ఎండు చేపల్లో ప్రోటీన్‌ కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాజాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో పాటు శరీరంలోని హార్మోన్లు, ఎంజైమ్‌లు ఇతర రసాయనాల సమతుల్యం చేసేందుకు కూడా ఉపయోగపడతాయి.

కీళ్ల నొప్పులు : శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ను తగ్గించే గుణం కూడా ఎండు చేపల్లో ఉంది. క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం : ఎండు చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా లభ్యమవుతాయి. వీటిని తీసుకుంటే రక్త నాళాలు శుభ్రం అవుతాయి. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వారానికి ఒకసారి అయినా ఎండు చేపల్ని తింటే.. రక్తం గడ్డ కట్టడం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

➡️