అమ్మమ్మ గారి ఊళ్లో భలే సరదాగా …

May 26,2024 04:10 #feachers, #jeevana, #katha

డిజి పేటలోని అమ్మమ్మ గారి ఇంటిలో గడిపిన ఈ వేసవి సెలవులు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ ఊరి చుట్టూ కొండలు, అడవులు, తోటలు నాకు భలే బాగా నచ్చాయి. రాత్రివేళ వెన్నెల వెలుగులో, చల్లని వాతావరణంలో కుటుంబ సభ్యులందరం మిద్దెపై కూర్చుని కబుర్లు చెప్పుకోవడం భలే బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడే ఆటలన్నీ నాకు కొత్త కొత్తగా అనిపించాయి. అమ్మమ్మ గారి మామిడి తోట ఎంతో బాగుంది. బెంగళూరులో స్కూలు, ఇల్లు, చదువు, ఫోన్‌, టీవీ ఇదే లోకంగా ఉండేది. వేసవి సెలవులలో అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పిల్లలతో కలిసి ఆడుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. భైరవకోనలో జలపాతం భలే బాగా నచ్చింది. అక్కడ కొలనులో ఈత కొట్టడం సరదాగా ఉంది. ముఖ్యంగా డిజి పేటలో రామాలయం వద్ద ఆడవాళ్లు చేస్తున్న భజన భలే వెరైటీగా ఉంది. తాతయ్యతో కలిసి ఊరిలో స్కూటర్‌పై తిరుగుతుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఇక్కడి నుంచి బెంగుళూరు వెళ్లాలంటే ఏదోలా వుంది. ఇంత ఆనందమైన రోజులను ఎప్పటికీ మరచిపోలేను.

– నైనిక రెడ్డి,
8వ తరగతి, బెంగళూరు.

➡️