యూనిఫామ్‌ విధానాన్ని రద్దు చేయండి – మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామికి వినతి

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్‌ విధానాన్ని రద్దు చేయాలని ఆంద్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్‌ రజాక్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామిని బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రెండున్నరేళ్ల క్రితం ఉద్యోగులకు యూనిఫామ్‌ ఇచ్చారని, అలవెన్స్‌లు ఇవ్వలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇచ్చిన యూనిఫామ్‌లు పాడైపోయాయని, యూనిఫాం ధరించలేదనే కారణంతో ఎంపిడిఒ, కమిషనర్లు అనేకచోట్ల సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు, మెమోలు ఇస్తూ సస్పెండ్‌ చేస్తున్నారని మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో కృష్ణా, ఎన్‌టిఆర్‌, గుంటూరు జిల్లాల నేతలు ఉన్నారు.

➡️