పచ్చా పచ్చని

Apr 22,2024 05:17 #feachers, #jeevana, #watermelon

పచ్చా పచ్చని కాయ
ముచ్చటైన పుచ్చకాయ
స్వచ్ఛమైన పుచ్చకాయ
మంచి చేసే పుచ్చకాయ

పైకి చూడ పచ్చగుండు
కోసి చూస్తే ఎర్రగుండు
తింటే తియ్యగా నుండు
కొంటే చౌకగా ఉండు

పోషకాలు దండి గుండు
జ్ఞాపకశక్తి పెంచు మెండు
వేసవిలో వచ్చే నండి
దాహాన్నే తీర్చేనండి

జీర్ణశక్తి పెంచుతుంది
చర్మమే బాగుండునండి
పుచ్చ రసమే తాగండి
పచ్చగా జీవించండి

– గుండాల నరేంద్రబాబు,
94932 35992.

➡️