వేసవి సెలవుల్లో మా స్నేహితులు

May 19,2024 05:40 #feachers, #jeevana

వేసవి సెలవులకు మా స్నేహితుల్లో కొందరు వారి బంధువుల ఇంటికి వెళ్ళారు. ఇంకొందరు ఇంటి దగ్గర ఉన్న స్నేహితులతో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆడుకొని తరువాత ఎవరి ఇంటికి వారు వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం లేదా టీవీ చూడడం చేస్తున్నారు. మరి కొందరు మామిడి తోటలకు వెళ్తున్నారు. చింత పండు కొట్టడానికి కూడా మా ఫ్రెండ్స్‌ వెళ్తున్నారు. అలా సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతున్నారు. ఇంటి పనుల్లో కొంతమంది అమ్మకు సహాయం చేస్తున్నారు.
సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఆటకు బయలుదేరుతారు. రాత్రి ఇంటికి వచ్చి అమ్మానాన్నతో కలిసి తింటారు. తాత లేదా నాయనమ్మ దగ్గర నిద్రపోతూ కథలు చెప్పమంటారు. కొందరు పిల్లలు బంధువుల ఇంటి నుండి వచ్చి అక్కడ జరిగిన విషయాల గురించి చెబుతారు.
చాలా తక్కువ మంది మాత్రం ప్రతి రోజూ గంట సేపు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ హ్యాండ్‌ రైటింగ్‌ ప్రాక్టీసు చేస్తున్నారు. మరికొందరు జాతరలకు, యాత్రలకు కుటుంబం లేదా బంధువులతో వెళ్లారు. తిరిగి వచ్చి వారు చూసిన స్థలాలను, అక్కడ ఉన్న విశేషాల గురించి చెబుతున్నారు. కొంత మంది తెచ్చిన ప్రసాదాలు ఇంటి దగ్గరి వారికి పంచి పెడుతున్నారు. కొందరైతే నాలా పత్రికలకు కథలు రాస్తున్నారు, బొమ్మలు వేస్తున్నారు. అలా ఈ వేసవి సెలవులను మేమంతా చాలా సంతోషంగా గడుపు తున్నాం.

– కారంకంటి ప్రహారిని,8వ తరగతి,
జక్కాపూర్‌, సిద్దిపేట జిల్లా.

➡️