గంగపాయలాకు.. భలే రుచి!

Mar 7,2024 06:19 #Food, #Health Sector
Like Ganga Payal.. Great taste!

పెరట్లో పెరిగే మొక్కల మాటున గంగపాయలాకు మొక్క కూడా దానంతట అదే పెరుగుతుంది. చాలామంది ఈ మొక్కను పిచ్చి మొక్కగా భావించి పీకేస్తుంటారు. కానీ ఇది రుచికి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఔషధ మొక్క. ఈ మొక్కను గంగపావిలి, గోళీ ఆకు అని కూడా పిలుస్తారు. కాడలు, ఆకులు దళసరిగా ఉండి, రుచికి పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగుతుంది. నేల మీద పాకుతుంది. ఈ ఆకులో ఎ, బి విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆకును కూర, పప్పుగా వండుకుని తినవచ్చు. తరచూ ఈ ఆకులు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

  • ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. రక్త ప్రవాహానికి అడ్డుగా నిలిచే చెడు కొలెస్ట్రాల్‌ లేకపోవడంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  • ఇందులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
  • ఈ మొక్కలో ఉండే విటమిన్‌ ఎ కంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
  • ఈ ఆకులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకుకూర తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
  • ఇందులో ఉండే జింకు ప్రీ రాడికల్స్‌తో పోరాటం చేస్తుంది. ఈ ఆకులను ముద్దగా నూరుకుని రసం తీసి పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి.
➡️