మునగాకుతో బోలెడు లాభాలు

Feb 29,2024 07:40 #Food

మునగచెట్టు కాడలతో పాటు ఆకు, పూతలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని చాలామందికి తెలుసు. వీటిని ఆహారంలో కలిపి తీసుకుంటే అనారోగ్యానికి గురికారు. రక్తహీనత, రుతుక్రమ సమస్యలు ఉన్నవారు మునగాకు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

  • ఎండకాలంలో వచ్చే లేత మునగ ఆకుల్లో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుంది. దాంతో ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గులాంటివి దరి చేరవు. పుండ్లు, ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
  • పాలకూరతో పోలిస్తే ఈ ఆకులో మూడు రెట్లు ఐరన్‌ లభిస్తుంది. అరటిపండు కంటే ఏడు రెట్లు మెగ్నీషియం లభిస్తుంది. ప్రోటీన్లు ఉంటాయి. దీన్ని తరచూ పప్పుగానూ లేదా ప్రై రూపంలో తీసుకుంటే శక్తినిస్తుంది.
  • పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో శరీరంలో కొవ్వు పదార్థాలు కరిగి అధిక బరువును తగ్గిస్తాయి.
  • మునగలో ఉండే క్లోరోజనిక్‌ చెడు కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.
  • మునగాకులో విటమిన్‌ ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు ప్రోటీన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.
➡️