చెట్లను కాపాడుదాం

Feb 17,2024 07:14 #Environment, #Jeevana Stories
save trees

సీతాపురం అనే గ్రామంలో గీత, నాగరాజు అనే దంపతులు ఉన్నారు. వారికి మణిదీప్‌, మీనాక్షి ఇద్దరు పిల్లలు. గీత, నాగరాజు ఇద్దరూ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వాళ్ళ ఇంటి ముందు ఒక జామ చెట్టు ఉంది. ఒకసారి ఆ చెట్టు నుంచి ఎండిపోయిన జామాకులు కింద పడి చెత్త బాగా పేరుకుపోయింది. దీంతో నాగరాజు గొడ్డలితో జామ చెట్టును నరికి వేయడానికి వెళ్ళాడు. అది చూసిన మనిదీప్‌, మీనాక్షి వద్దని ఆపారు.

‘చెట్లు నరకడం మూలంగా ప్రకృతి ఉండదని పాఠశాలలో మాస్టర్‌ చెప్పారు. చెట్లు ఉంటేనే మనకు ప్రాణవాయువు ఉంటుంది. మనకు రక్షణ చెట్లు’ అని నాన్నకు అర్థమయ్యేలా చెప్పారు.

అయినా వారి మాటలు వినకుండా నాగరాజు చెట్టును కొట్టాడు. ఒక చిన్న కొమ్మ వచ్చి నాగరాజు కంట్లో గుచ్చుకుంది. వెంటనే నాగరాజును ఆసుపత్రికి తీసుకువెళ్లగా ‘గాయం చిన్నదే గనుక కొద్ది రోజుల్లో మానుతుంద’ని డాక్టర్లు చెప్పారు. ఇంటి దగ్గరే ఉంటున్న నాగరాజు ప్రతిరోజూ ఆ జామ చెట్టు వంక చూసి బాధపడతాడు. ‘తన కంటికి చిన్న గాయమైతేనే ఇలా విలవిలాడుతున్నాను. మరి జామ చెట్టు కూడా ప్రాణం ఉంటుంది కదా! పిల్లలు చెప్పింది నిజమే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుంచి చెట్లను నరకను’ అని మనసులో గట్టిగా అనుకున్నాడు. అనుకోవడమే కాదు, పిల్లలిద్దరితో పెరట్లో ఎన్నో మొక్కలు నాటించాడు.

నీతి : పచ్చని ప్రతి చెట్టును కాపాడాలి. 

  • సన,8వ తరగతి, జెడ్‌పిహెచ్‌ హవేలీ ఘనపూర్‌, మెదక్‌ జిల్లా,98495 05014.
➡️