ఎండలు బాబోయ్

May 7,2024 04:49 #feachers, #jeevana, #sun burning

ఎండలు బాబోయ్ ఎండలు
ఎక్కువ తిరగొద్దు మనమండోయ్

భగభగ మంటూ ఎండలు
నిప్పుల వాన కురిపిస్తున్నవి

ఉక్కపోతతో జనమంతా
ఉక్కిరి బిక్కిరి అవుతుండ్రు

భానుడి వేడికి భూమంతా
అగ్ని గుండమై మండుతుంది

తరువులు చెరువులు
పక్షులు పశువులు
దాహం దాహం అంటున్నరు

మనిషి స్వార్థం పెచ్చు పెరుగెను
పర్యావరణం తగ్గిపోయెను

పెరిగిన ఎండలు అగ్నిగుండమై
తలపిస్తున్నారు
బయటకు అస్సలు పోవద్దు
జాగ్రత్తగా మెసలడం మేలు

– కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
94415 61655.

➡️