ఉయ్యాల-ఉయ్యాల

Mar 15,2024 06:50 #feachers, #jeevana, #Kavitha

చెట్టుకింద ఉయ్యాల
చక్కనైన ఉయ్యాల
ఊగుదాం ఉయ్యాల
చెల్లి రావే, ఈ వేళ …

ఊగుదాం ఊగుదాం
ఉయ్యాల ఊగుదాం
పాడుదాం పాడుదాం
పాటలెన్నో పాడుదాం

నవ్వుతూ నవ్వుతూ
ఉయ్యాల ఊగుదాం
ఊగుతూ ఊగుతూ
పైపైకి ఊగుదాం

కొట్టుకోకుండా
తిట్టుకోకుండా
చెట్టు నీడలో ఊగుదాం
చెల్లి మనము ఊగుదాం

ఉయ్యాల ఊగుతూ
ఊరినే మారుద్దాం
మంచిగా ఊగుతూ
మైమరిచి పోదాం!

– చాడా మునిశేఖర్‌ రెడ్డి,
ప్రొద్దుటూరు.

➡️