1800 అడుగులమేర కిందపడిన లిఫ్ట్‌ – చిక్కుకున్న అధికారులు-గనిలో 150మంది కార్మికులు

రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని జుంజునులోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సిఎల్‌) గనిలో లిఫ్ట్‌ మెషిన్‌ 1800 అడుగుల మేర పడిపోవడంతో విజిలెన్స్‌ బఅందంతో సహా 15 మంది అధికారులు లిఫ్ట్‌లో చిక్కుకున్నారు.

మంగళవారం సాయంత్రం విజిలెన్స్‌ బఅందం గనిలోకి ప్రవేశించింది. గని నుంచి బయలుదేరుతుండగా రాత్రి 8 గంటల 10 నిముషాల సమయంలో లిఫ్ట్‌ చైన్‌ తెగిపోయింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న 15 మంది అధికారులు అందులో చిక్కుకున్నారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న గనిలో 150 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. ఈ లిఫ్ట్‌ ప్రమాదం కారణంగా వీరంతా కూడా గనిలోనే చిక్కుకుపోయారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిని ముందుగా రక్షించనున్నారు. ఆ తర్వాతే కార్మికులను రక్షించనున్నారు. ప్రస్తుతం ముగ్గురు అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. కోలిహన్‌ గని డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎకె శర్మ, మేనేజర్లు ప్రీతమ్‌ సింగ్‌, హర్సిరామ్‌లను రక్షించారు. లిఫ్ట్‌లో నుంచి ప్రజలను రక్షించకపోతే గనిలో చిక్కుకున్న 150 మంది కార్మికులను రక్షించడం కష్టం.

లిఫ్ట్‌లో ఆక్సిజన్‌ సరఫరా…
కోలిహన్‌ గనిలో ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే… రెస్క్యూ టీమ్‌ నిన్న రాత్రి భిల్వారా జిల్లాలోని రాంపుర నుండి బయలుదేరింది. త్వరలో రాంపుర రెస్క్యూ టీమ్‌ ఖేత్రికి చేరుకుంటుంది. ప్రస్తుతం స్థానిక బఅందం సహాయక చర్యల్లో నిమగమై ఉందని నీమ్‌కథాన ఎస్పీ తెలిపారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న అధికారులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగకుండా ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. సమీపంలోని ఆసుపత్రుల నుంచి అన్ని అంబులెన్స్‌లను రప్పించామని ఎస్పీ తెలిపారు. వైద్యుల బఅందాలను కూడా అత్యవసర పరిస్థితులకు సిద్ధం చేయాలని కోరారు.

రాగి తవ్వకం.. ఖనిజం వెలికితీత…
ఇక్కడ 1967లో హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ ద్వారా రాగి తవ్వకాన్ని ప్రారంభించారు. ఇక్కడి నుంచి 24 మిలియన్‌ టన్నుల ఖనిజాన్ని వెలికితీశారు. ఇందులో 16 మిలియన్‌ టన్నులు ఇంకా తవ్వాల్సి ఉంది. లిఫ్ట్‌ ప్రమాదం తర్వాత రెస్క్యూ టీం లేకపోవడంతో రెస్క్యూ పనులకు సమయం పడుతోంది. కాపర్‌ మైన్‌కు చెందిన ఎస్‌ఎంఎస్‌ కంపెనీ, ఖైతాన్‌ కంపెనీ ఉద్యోగుల బఅందం కోలిహాన్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్‌ రాంపుర చేరుకున్న వెంటనే, తదుపరి సహాయక చర్యలు జరుగుతాయి.

ఇనుపతాళ్లపై లిఫ్ట్‌ నడుస్తుంది.. లిఫ్ట్‌ తప్ప వేరే దారి లేదు….
గని చాలా లోతుగా ఉందని స్థానిక కార్మికులు తెలిపారు. ఇక్కడ సెకనుకు మూడు మీటర్ల వేగంతో లిఫ్ట్‌ డౌన్‌ అవుతుంది. లిఫ్ట్‌ ద్వారా మాత్రమే లోపలికి వెళ్లవచ్చు. ఇది తప్ప వేరే ఆప్షన్‌ లేదు. ఈ లిఫ్ట్‌ ఇనుప తాళ్లపై నడుస్తుంది. ప్రయాణానికి రెండు వేర్వేరు లిఫ్ట్‌లు ఉన్నాయి. గనిలోకి వెళ్లే ముందు ప్రతి కార్మికుడికి వైద్య పరీక్షలు చేస్తారు. ఇది లేకుండా గని లోపలికి వెళ్లడానికి అనుమతి లేదు. ఖేత్రీ రాగి గనిలో, ఉద్యోగులకు రెండు చోట్ల హాజరు ఉంది. ఈ క్రమంలో అప్పటికే గనిలో 150 మంది కూలీలు ఉన్నట్లు తేలింది. లిఫ్ట్‌ ప్రమాదం కారణంగా వారు కూడా అక్కడే ఇరుక్కుపోయారు.

ఒకటి, రెండు గంటల్లో అందరినీ బయటకు తెస్తాం : ఎస్పీ ప్రవీణ్‌నాయక్‌ నునావత్‌
రాత్రి 1 గంటకు సంఘటనా స్థలానికి చేరుకున్న నౌమ్‌కథాన కలెక్టర్‌ శరద్‌ మెహ్రా.. ప్రస్తుతం అంతా సక్రమంగానే ఉందన్నారు. ప్రాణనష్టం లేదు. స్వల్ప గాయాలు కావచ్చు, ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఒకటి, రెండు గంటల్లో అందరినీ బయటకు తీసుకొస్తామని ఎస్పీ ప్రవీణ్‌నాయక్‌ నునావత్‌ తెలిపారు. ఖేత్రి ఎమ్మెల్యే ధరంపాల్‌ గుర్జార్‌ మాట్లాడుతూ, అంబులెన్స్‌లు, వైద్యుల కోసం పరిపాలన ఇప్పటికే బయట ఏర్పాట్లు చేసిందని చెప్పారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సదుపాయాలు అందిస్తామన్నారు.

➡️