క్రిమినల్‌ కేసుల్లో విచారణ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగడం లేదు

May 6,2024 07:57 #CJI Chandrachud
  •  ప్రజల్లో నెలకొన్న ఈ భావనను తొలగించాలి
  •  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు టేప్‌ రికార్డర్లుగా వ్యవహరించొద్దు
  •  సిజెఐ చంద్రచూడ్‌ హితవు

న్యూఢిల్లీ: క్రిమినల్‌ కేసుల్లో విచారణ ‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా’ జరగడం లేదనే భావన ప్రజల్లో ఎక్కువగా ఉందని, దీనిని తొలగించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.. పబ్లిక్‌ ప్రపాసిక్యూటర్లు టేప్‌ రికార్డర్లలా వ్యవహరిం చరాదని ధర్మాసనం హితవు పలికింది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా విచారణ నేర న్యాయ శాస్త్రానికి పునాది అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రాసిక్యూటర్‌ సాక్షులను విచారించేటప్పుడు వ్యవహరించిన తీరు వారు విరోధిగా మారేలా ఉందని, ఇది సరికాదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ”ట్రయల్‌ ప్రొసీడింగ్స్‌లో న్యాయమూర్తుల సహచరుల్లాంటివారని అభివర్ణించిన జస్టిస్‌ పార్దివాలా, ” వీరి నియామకం ి వంటి వాటిలో రాజకీయ పరిశీలనకు సంబంధించిన అంశాలు ఉండకూడదని కోర్టు తన తీర్పుల ద్వారా పదే పదే చెబుతోంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించేటప్పుడు వ్యక్తి యొక్క యోగ్యతను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఆ వ్యక్తి సమర్థుడైనంత మాత్రాన చాలదు, నిష్కళంకమైన పాత్ర, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా కూడా ఉండాలి అని ధర్మాసనం తరపున తీర్పు రాస్తూ జస్టిస్‌ పార్థివాలా అన్నారు. అతను ఎటువంటి పరిమితులు, ఆదేశాలు లేకుండా స్వతంత్రంగా పని చేయగల వ్యక్తి అయి ఉండాలి. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌, న్యాయవ్యవస్థ మధ్య సంబంధం నేర న్యాయ వ్యవస్థకు మూలస్తంభం వంటిదని అన్నారు.

➡️