ఒకానొక నగ్నాక్షరం

Jan 29,2024 08:21 #sahityam

దుమ్మూ.. ధూళి పట్టిన

ఆచ్ఛాదనలన్నీ

ఒక్కొక్కటిగా విసర్జించి

పుటం పెట్టుకున్నాయి

రగులుతున్న నగ్నాక్షరాలు

 

చీడ పీడ పట్టిన

చీకటి పత్రాలపై

యుద్ధాన్ని ప్రకటిస్తున్నాయి

 

ఉన్మత్త ప్రేలాపలనల

నాలుకలను తెగనరికే

ఆయుధాలకు పోతపోస్తున్నాయి

 

అదిగో

తిరుగుబాటు శిఖరంపై

అక్షర తాండవం

సమస్యల రక్కసిపై

జనాగ్రహ ఘీంకారం

 

అచంచల భావ స్ఫూర్తితో

ఆగామి విప్లవాన్ని

కలం నాసికలు ఆఘ్రాణిస్తున్నాయి

రాజకీయ ఘస్మరులపై

అక్షర స్వరాలు

ముగింపు వాక్యాన్ని

నిర్మిస్తున్నాయి…!

– డా. కటుకోఝ్వల రమేష్‌ 99490 83327

➡️