ప్రముఖ డబ్బింగ్‌ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత

చెన్నై : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్‌ రచయిత శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు తెలుగు డబ్బింగ్‌ చెప్పే గాయకుడు మనోను ఆయనకు పరిచయం చేసింది శ్రీరామకృష్ణే. 300 చిత్రాలకు పైగా డబ్బింగ్‌ రచయితగా పనిచేశారు. వాటిల్లో జెంటిల్మెన్‌, చంద్రముఖి వంటి హిట్‌ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా, రామకృష్ణ చివరగా రజనీకాంత్‌ సినిమా ‘దర్బార్‌’కు డైలాగ్స్‌ రాశారు.

➡️