మధ్యాహ్నం ఒంటిగంటకు ఎపిలో 36 శాతం – తెలంగాణలో 40 శాతం పోలింగ్‌

May 13,2024 13:33 #36 percent, #Andhra Pradesh, #Polling

అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎపిలో 36 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇదే సమయానికి తెలంగాణలో 40 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.

➡️