నానీలు

Dec 10,2023 11:32 #kavithalu, #Sneha

నదిని

అలా వదిలేస్తే ఎలా?

అందుకే అది

కడలిని చేరింది!

జీవితమే

ఒక నాటక రంగం!

పాత్ర ముగిసాక

నిష్క్రమించాలి!

తనువుకే

వయస్సు వచ్చేది!

మనసెపుడూ

నిత్య నూతనం!

ఎవరెక్కువ

ఎవరు తక్కువ?

తేడాలెందుకు

కలిసుంటే చాలు!

వర్షం వచ్చింది!

నింగికి నేలకు

మధ్యసంభాషణ

మొదలయింది!

సీట్లు కొన్నారు

నోట్లు పంచారు!

పదవుల కోసం

దిగజారిపోయారు!

మట్టి లేనిదే

గింజ మొలవదు!

మనసు లేనిదే

మనిషి ఎదగడు!

మెతుకు కోసం

వలస బతుకు!

ఏ ఊరెళ్ళినా

ఎదురొచ్చేది అదే!

బి.గోవర్ధనరావు 94419 68930

➡️