30 ఏళ్ల లోపు మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.. ఎందుకంటే?

Jan 4,2024 13:29 #health, #Women

ఇంటర్నెట్‌డెస్క్‌ : ముప్పై ఏళ్ల లోపు మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వారు ఎప్పటికప్పుడు హెల్త్‌ చెకప్‌లు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు మహిళలు అధిక ఒత్తిడికి గురై.. ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

– నేటికాలంలో చాలామంది ఆహారాన్ని ఆలస్యంగా తీసుకోవడం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఈ అలవాట్ల వల్ల పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటి అలవాట్ల కారణంగానే.. మహిళలు త్వరగా గర్భం దాల్చలేకపోతున్నారు. 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు వారికి గర్భం దాల్చడానికి అనువైన సమయం. 30 ఏళ్లకు దగ్గరవుతున్నకొద్దీ సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతుంది. ఇక 35 ఏళ్లు దాటిన మహిళలు గర్భం దాల్చడం చాలా కష్టమవుతుంది. మహిళల శరీరం దానికి సహకరించదు అని డాక్టర్‌ శోభా గుప్తా అన్నారు.

– రోజూ వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజూ ఒక గంట వాకింగ్‌ చేస్తే మహిళల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాయమం వల్ల అధిక బరువు, ఒత్తిడి, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారని గుప్తా సలహా ఇచ్చారు.

– ముప్పై ఏళ్ల లోపు మహిళలు తప్పనిసరిగా థైరాయిడ్‌ టెస్టులుతప్పనిసరి. కుటుంబంలోని వారి హెల్త్‌ హిస్టరీని గమనంలో ఉంచుకుని ఎప్పటికప్పుడు హెల్త్‌ చెకప్‌ చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

➡️