డయాబెటిక్స్‌ ఏ బియ్యాన్ని తింటే మంచిది?

Dec 13,2023 13:23 #health

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : నేటికాలంలో షుగర్‌తో బాధపడేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తీసుకునే ఆహారాన్ని ఆచితూచి తినాలి. లేకపోతే షుగర్‌ స్థాయిలు పెరిగే ప్రమాదముంది. రైస్‌ ఎక్కువగా తీసుకునేవారు.. షుగర్‌ ఉందని తెలిసిన తర్వాత.. దాన్ని తీసుకోవడానికి భయపడిపోతారు. రైస్‌లో అత్యధికంగా కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయిల్ని పెంచుతాయి. దీంతో చాలా మంది రైస్‌ తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే రైస్‌ తీసుకుంటే..చక్కెర స్థాయిలు పెరుగుతాయి అనే ఆలోచనను నుంచి బయటపడి సమతుల్య ఆహారం తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిక్స్‌ తినే ఆహారంలో ఏ బియ్యాన్ని ఎంచుకుని తింటే మంచిదో వైద్యులు సలహా ఇస్తున్నారు.

బ్రౌన్‌ రైస్‌

మధుమేహవ్యాధిగ్రస్తులు వైట్‌ రైస్‌ కన్నా.. బ్రౌన్‌ రైస్‌ తింటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. బ్రౌన్‌ రైస్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌్‌ (జిఐ) ఉంటుంది. ఇది చక్కెరను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది.

బాస్మతి రైస్‌
బాస్మతి రైస్‌ తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. వైట్‌ రైస్‌ కంటే.. బాస్మతిరైస్‌లో తక్కువ జిఐ ఉంటుంది.

మిక్స్డ్‌ గ్రెయిన్‌ రైస్‌

బ్రౌన్‌ రైస్‌తోపాటు ఇతర ధాన్యాల మిశ్రమాన్నే మిక్స్డ్‌ గ్రెయిన్‌ రైస్‌ అంటారు. షుగర్‌ ఉన్నవాళ్లకి ఈ రైస్‌ సరైన ఎంపికగా వైద్యులు చెబుతున్నారు. ఇవి రుచికరంగానూ, ఆరోగ్యాన్ని అందజేస్తాయని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. రైస్‌తోపాటు కూరగాయల్ని ఉడికించుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. ఒక్కోసారి రైస్‌కు బదులుగా చికెన్‌ సూప్‌ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే మధ్యాహ్నం భోజనంకి బదులు రైస్‌ సలాడ్‌, క్యాలీఫ్లవర్‌ రైస్‌ తీసుకున్నా హెల్త్‌కి మంచిది. ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం, యోగా, వాకింగ్‌ వంటివి చేస్తే.. షుగర్‌ స్థాయిలు పెరగకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

➡️