చిన్నారుల ఆరోగ్యానికి నట్స్‌ మేలు చేస్తాయి

Mar 4,2024 17:58 #child, #health

ఇంటర్నెట్‌డెస్క్‌ : చిన్నారులు ఫాస్ట్‌ఫుడ్‌ని ఎక్కువగా ఇష్టపడతారు. వీటివల్ల పిల్లల ఆరోగ్యం తరచూ దెబ్బతింటుంది. వారి ఆరోగ్య సంరక్షణ కోసం తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రత్యేకించి చిన్నారులకు తినిపించే ఆహార పదార్థాల్లోనూ మార్పులు చేసుకుంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. తాజా పండ్లతోపాటు, విత్తనాలు, నట్స్‌ కూడా వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.

బాదంపప్పు

బాదంపప్పులో విటమిన్‌ ఇ ఉంటుంది. అలాగే వీటిల్లో హెల్తీ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి చిన్నారుల మెదడు ఆరోగ్యానికి మరింత సహాయపడతాయి. అందుకే చిన్నారులకు రోజూ నానబెట్టిన బాదంపప్పుల్ని తినిపిస్తే ఆరోగ్యానికెంతో మంచిది.

వాల్‌నట్స్‌

వాల్‌నట్స్‌లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

నువ్వులు

నువ్వులలో కాల్షియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి దోహదపడతాయి. వీటితో చేసిన పదార్థాల్ని తీసుకుంటే సత్వర శక్తిని పొందుతారు.

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో… మెగ్నీషియం, జింక్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

➡️