ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..!

Dec 28,2023 07:54 #Anganwadi Workers, #Poetry
wg anganwadi workers strike on 11th day palakollu

 

మాట తప్ప ను..మడమ తిప్పనని

అంగన్వాడీల ఆడ బిడ్డలకు కూడా

అందమైన శుద్ధ అబద్ధాలు చెప్పి

అందలమెక్కిన అధికారమా..!

 

ఎన్ని కల కు ముందు ఊరూరా తిరిగి

వేతనాలను పెంచుతానని మమ్మల్ని ఊరించావు..!

ఐదేళ్లు గడిచినా మా డిమాండ్లును

నెర వేర్చమని మూకుమ్మడిగా నిరసనలకు దిగితే

మీ నోట మాటరాదు …ఇదేమి చోద్యం..?

 

మా హామీ లు భగవద్గీత అని అంటివి

మా వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథం అన్నావు

మా మాట తిరుగు లేని ఖురాన్‌ అని కితాబు నిచ్చావు

ఇపుడు మా కిచ్చిన హామీ లను తక్షణం

అమలు చేయమంటే నీళ్ళు నములు తున్నారెందుకు??

 

అంగన్వాడీ కేంద్రాలలో అనాదిగా

అతి తక్కువ జీతాలతో తల్లీ బిడ్డలకు

అలు పెరుగక సేవ లందిస్తున్న చిరుద్యోగులం..!

సేవలు లేకుండా దోవన పోయే దానయ్యలకు

హాయిగా వేలాది కోట్లు తాయిలాలు అందిస్తున్నావు ..!

పెరుగుతున్న ధరలకు సరి సమానంగా

మా వేతనాలు పెంచమని ప్రాధేయపడుతుంటుంటే

మీలో కాస్త కనికరం లేదు ..? మా పై మమకారం మగ్యం ??

మా ఆందోళనలను తీవ్రంగా ఉధతం చేస్తాం ..!

మహిళా శక్తి ఏమిటో… మీకు తెలిసేలా చేసి చూపుతాం..!!!

 

– జి.సూర్యనారాయణ, దివిసీమ.(అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన కు మద్దతుగా)

➡️