అక్షర సేద్యం…!

Jun 30,2024 09:01 #kavitalu, #Sneha

నా కలం
భూమి పొరలను చీల్చుకుంటూ
మొలకెత్తే విత్తనం
కష్టాల కొలిమిలో
కాలుతున్న అగ్నికణం

అణచివేతపై ఎగిసిపడే
అక్షర కెరటం
అజ్ఞాన చీకటిలో
విజ్ఞాన దీపం

నిరంకుశ పాలనపై
ఉన్మాదంపై.. దౌర్జన్యం పై
తిరగబడే పీడితుల
స్వేచ్ఛా గీతం

నా కవిత్వం
ఎర్ర పూల వనంలో
సమాజ వికాసానికై
సమ సమాజ స్థాపనకై
అక్షర సేద్యం..!

ఎస్‌.కె బాజీ సైదా
8897282981

➡️