దేశ భక్తి నురగలు

Jan 28,2024 10:32 #Poetry
poetry on patriotism

లేగ దూడను చూసి చూడగనే..

ఆవు పొదుగు పాలు పొర్లినట్లు..

మాతృభూమి మదిన దొర్లగనే..

ఉప్పొంగాలి దేశభక్తి నురగలు !

 

జాతి హితం కోరడమే దేశ సేవ

చెడును తిరస్కరించడమే దేశభక్తి

పరహిత భావనమే కదా దైవత్వం

నిస్వార్థ సేవా హస్తాలే పవిత్రం !

 

జాతీయ జెండా స్వేచ్ఛ గలగలలు

అవసరార్థులకు ఆపన్నహస్తాలు

అవినీతి వ్యతిరేక ఉద్యమ గళాలు

సంక్షేమ గొడుగులు పట్టాలి పౌరులు !

 

మనో మురికిని కడిగేయడమే కాదు

సద్భావన సుగంధాల్ని అద్దడం

సమాజ కుళ్లును ఉతికేయడమే..

భరతమాతకు దేశభక్తుల క్షీరాభిషేకం !

 

  • మధుపాళీ, 9949700037
➡️