దారి..

Jan 21,2024 09:02 #Poetry
poetry on youth motivation

దారిలో నడిచే పాదాలు

అలవాటు పడ్డాయి

మెదళ్ళని, కొన్ని ప్రశ్నలని వదిలేసి

లోకంతోనే సర్దుకు పోతున్నాయి!

అందరూ నడుస్తున్నారు

ముందుకెళ్లాలని!

కొందరిని నెట్టేస్తూ..

కొందరిని తొక్కేస్తూ..!

ఇంతకీ ఈ దారి

గమ్యం ఎంత వరకు

ఈ గమనం దేని కొరకు

దారికిరువైపుల

మూగబోయిన హృదయాలు

వారు నిస్సహాయ బాధితులు

నిత్యం అసహనంగా

కన్నీళ్ళపాట పాడుకుంటారు

కానీ వినే వారే లేరు!

ఈ దారి ఒకప్పుడు ముళ్ళదారి

నేడు గతుకుల దారి

ఇక్కడ ముందుకెళ్లే వారే కానీ

రేపటి తరాన్ని కదిలించి

నడిపించే వారెక్కడా!

ఏ దారుల్లో.. రాజ్యం వెళ్తుందో

గమనించు..

నేడు కనుగొని

కనీసం కొన్ని పాదాలను కదిలించు.

 

  • రామ్‌ పెరుమాండ్ల – 9542265831
➡️