ఊరినడుగుతోంది..

Jun 30,2024 09:36 #kavithalu, #Sneha

కర్రపోటుతో వంగిన నడుముతో
ముదుసలిలా ఎదురొచ్చింది ఊరు
గుర్తుపట్టలేంతగా రూపం మారి
పూరిపాకలు అంతస్థులుగా మొలిచినా
మరగుజ్జు మనసులతో
మనుషులు ఇరుకుగా కనిపిస్తున్నారు
ఉనికిని మరచి వేరు కుంపటితో
జీవితాలను చెక్కుకొని
నగంగా ఊరేగే నాజూకు జీవితం
రక్తం చిందించిన తరాన్ని
ఏకాంతలోకి నెట్టేసింది
వయసు పెరిగేకొద్దీ
వెర్రితలలు వేస్తున్న ఊరిని
పాతతరం ప్రశ్నిస్తోంది
మనసులెక్కడని.. మనుషులెక్కడని..?
తలదించుకునేలాగా తలలెగరేసి
తెగించిన తరాన్ని చూసి.. బాధగా..!!

చందలూరి నారాయణరావు
9704437247

➡️