ఇదే ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇదే..!

May 12,2024 11:11 #kavithalu, #Sneha

ఎన్నికల నగారా మోగించాం
ప్రజలకు హామీలు ఇచ్చేస్తాం
పథకాలు పెట్టేస్తాం
రిజర్వేషన్లు అమలు చేసేస్తాం
ఉద్యోగాల భర్తీ చేసేస్తాం
ఊరు వాడ ప్రచారం చేసేస్తాం
సభలు నిర్వహిస్తాం
మైకులు పెట్టి వాయిస్తాం
మద్యం డబ్బు పంపిణీ చేస్తాం
ప్రజాస్వామ్యం పేరుతో గద్దెనెక్కేస్తాం
సంపన్నులకు వేలకోట్లు దోచిపెడతాం
మతోన్మాదం పెంచేస్తాం
అభివృద్ధి పేరుతో భూములు అమ్మేస్తాం
దేశాన్ని తాకట్టు పెట్టేస్తాం
అప్పులు తెచ్చేస్తాం
సంక్షేమ డబ్బులుగా పంపిణీ చేసేస్తాం ..
స్విస్‌ బ్యాంకుల్లో డబ్బులు దాచేస్తాం
ప్రజలను బిక్షగాళ్లుగా మార్చేస్తాం…
ప్రజా హక్కులకే ఉద్యమిస్తే
ప్రజాస్వామ్యాన్ని అడిగితే..
అవినీతిని ప్రశ్నిస్తే..
అక్రమాలను నిలదీస్తే
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తాం
ప్రజాస్వామ్యం పేరుతో
ఐదేళ్లకొకసారి మళ్లీ మళ్లీ
మళ్లీ ఎన్నికలు.. గద్దె నెక్కేస్తాం..
ఇదే ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇదే..!

ఎస్‌. కె. బాజీ సైదా
8897282981

➡️