వర్చ్యువలిజం..!

Apr 14,2024 13:19 #Sneha

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్క్రిప్టెడ్‌
అధునాతన సాంకేతిక యుగంలో..
జీవించిన క్షణాలన్నీ దృశ్యమాలికలై
ప్రతిరోజూ నిక్షిప్తమవుతున్నాయి..!
ఉరుకుల పరుగుల జీవితంలో..
ప్రత్యక్షంగా పలుకలేని మాటలు
ప్లాస్టిక్‌ పూల ఏమోజీలతో
ఫేస్‌ బుక్‌ కామెంట్స్‌గా
అలరారుతున్నాయి..!
రోజంతటి స్థితిగతులకు
స్పందించే వాట్సాప్‌ మెసేజ్‌లన్నీ
మమతలను పంచే డాటాని
బ్యాకప్‌ చేస్తూ దాచేస్తున్నాయి..!
దాటిపోతున్న అనంతకాలంలో
ఎగిసిపడుతున్న రంగుల కలలు
మనసుని జ్ఞాపకమై స్పర్శించి
క్షణికమై వెనుదిరుగుతున్నాయి..!
పుట్టుక చావులకు అతీతంగా
వర్చ్యువలిజం వర్తమానాన్ని పాపప్‌ చేస్తూ
అనుభూతులన్నింటినీ ఉత్సవం చేస్తూ
సరికొత్తగా ముందుకు నడిపిస్తున్నాయి..!!

వాసాల వరప్రసాద్‌,
9490189847

➡️